బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (17:11 IST)

నగరి మున్సిపాలిటీలో పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా

చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పార్కును ప్రారంభించారు. ఆమె శుక్రవారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులోభాగంగా ఓ పార్కును కూడా ప్రారంభించారు. అనతరం ఆ పార్కులో ఏర్పాటు చేసిన జిమ్‌లో రోజా దంపతులు వ్యాయామం చేస్తూ సరదాగా గడిపారు. 
 
కాగా, నగరి పట్టణంలోని బుగ్గ అగ్రహారంలో 20 లక్షల రూపాయల వ్యయంతో బోరుస, పైప్ లైనును ప్రారంభించారు. అలాగే, పుత్తూరులో రూ.1.10 కోట్ల వ్యయంతో తుడు నిధులతో ఈ పార్కును నెలకొల్పారు.