మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (12:26 IST)

ఎమ్మెల్యేగా నోముల భగత్‌ ప్రమాణం - రూల్స్ బుక్స్ అందజేత

తెలంగాణా రాష్ట్రంలోని నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్‌ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు తదితరులు పాల్గొన్నారు.
 
నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హఠాన్మరణంతో ఆ నియోజకవర్గానికి గత ఏప్రిల్‌ 17న ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో దివంగత నరసింహయ్య కుమారుడు నోముల భగత్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిపై భారీ మెజారిటీతో భగత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే.