సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై చేజేసుకున్న నందమూరి బాలకృష్ణ  
                                       
                  
                  				  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారానికి సిద్ధమయ్యారు. కదిరిలో ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన, ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 
				  											
																													
									  
	 
	అయితే, ఎన్నికల ప్రచారానికంటే ముందే తన శైలిలో ఫ్యాన్స్‌పై దూకుడు షురూ చేసేశారు బాలయ్య. శ్రీ సత్యసాయి జిల్లాలో అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసి, చేయి కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 
				  
	 
	బాలకృష్ణ వచ్చిన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే.. హెలీప్యాడ్ దగ్గరకు ఒక్కసారిగా దూసుకొచ్చారు అభిమానులు. ఈ సందర్భంగా... జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ సమయంలో ఒక అభిమానికి బాలయ్యతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఇక్కడే అభిమానిపై బాలయ్య చేజేసుకున్నారు. ఆపై అభిమానులను అదుపు చేశాక.. మహిళా ఓటర్లను నవ్వుతూ పలకరించారు. నేటి నుంచి రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలకృష్ణ "స్వర్ణాంధ్ర సాకార యాత్ర" పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. దీని కోసం ఓ ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు.