మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2023 (09:24 IST)

నేటి నుంచి నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" యాత్ర

nara bhuvaneswari
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుతో అనేక మంది టీడీపీ కార్యకర్తలు గుండెలు ఆగిపోయి చనిపోయారు. వీరి కుటుంబాలను ఓదార్చే నిమిత్తం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం నుంచి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రను చేపడుతున్నారు. 
 
'నిజం గెలవాలి' పేరిట నిర్వహించే ఈ యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుందని, ఇందుకోసం పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ యాత్ర చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో మూడు రోజుల పాటు సాగుతుంది. భువనేశ్వరి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం నారావారిపల్లెకు చేరుకుని కులదేవతలకు పూజలు నిర్వహించడం తెలిసిందే.
 
'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె భావోద్వేగభరిత ట్వీట్ చేశారు. 'నా భర్త చంద్రబాబు నాయుడు గారు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను, ఆయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో రేపు తొలి అడుగు వేస్తున్నాను' అని వెల్లడించారు.