గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జులై 2019 (17:38 IST)

తుగ్లక్ పాలనలో ప్రవేశపెట్టిన కొయ్యగుర్రం బడ్జెట్ : నారా లోకేశ్

ఇటీవల వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇది తుగ్లక్ పాలనలో ప్రవేశపెట్టిన కొయ్యగుర్రం బడ్జెట్ అంటూ వ్యాఖ్యానించారు. అసత్యంతో సాధించిన విజయం కన్నా సత్యంతో సాధించిన పరాజయం మేలు అని గాంధీ చెప్పారని గుర్తుచేశారు. 
 
14 నెలల పాటు 3648 కిలోమీటర్ల పాదయాత్రలో జగన్ 600కి పైగా హామీలు ఇచ్చారని, అధికారంలోకిరాగానే 600 హామీలను నవరత్నాలకు కుదించారని అన్నారు. ఇప్పుడు ఆ నవరత్నాలపై కూడా ప్రజలకు నవ సందేహాలు కలుగుతున్నాయన్నరాు. బడ్జెట్ ప్రవేశ పెట్టక ముందు కూతల ప్రభుత్వం అని బడ్జెట్ చూసాక కోతల ప్రభుత్వం అని తేలిందన్నారు. సగం మందికే విద్య, సగం మందికే ఆరోగ్యం, సగం మందికే సంక్షేమం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, గ్రామ వాలంటర్లు పేరుతో వైఎస్ఆర్ కార్యకర్తల దోపిడీ పథకం, మద్యపాన నిషేధం అంటూ జగనన్న మద్యం దుకాణాలు చెప్పారు. 
 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రోజుకోవిధంగా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర అప్పులపై మూడు సార్లు మాట మార్చి అసలు నిజాన్ని అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టారు. పార్థసారథి అడిగిన ప్రశ్నకు సమాధానంగా గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అప్పు లక్ష కోట్లు అని చెప్పారన్నారు. బయట మాత్రం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం అన్న జగన్ తిరుపతిలో మోడీ కాళ్లు పట్టుకున్నారంటూ మండిపడ్డారు.

ఎంత మంచి నేల అయిన విత్తనం వేస్తేనే పంట అని ఆర్థిక మంత్రి అన్నారు. మనవి మంచి నేలలే కానీ ప్రభుత్వమే విత్తనాలు ఇవ్వలేక చేతులు ఎత్తేసింది మన రైతులకు ఇవ్వాల్సిన విత్తనాలు కర్ణాటక, తెలంగాణలో ఎలా ప్రత్యకమయ్యాయో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ అని పాదయాత్ర 11వ రోజు కర్నూలులో ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీ ఎక్కడికి పోయిందంటూ నిలదీశారు. గత ఐదు ఏళ్లలో 1500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, వారికి 7 లక్షల చప్పున పరిహారం ఇస్తాం అంటున్నారు చెప్పారు. 
 
వైఎస్ హయాంలో చనిపోయిన 15 వేల మంది రైతులకు పరిహారం ఇవ్వరా? ఆ కుటుంబాలకు ఓదార్పు అవసరం లేదా? 80 లక్షల మంది రైతులకు రైతు భరోసా అని హామీ ఇచ్చారు. ఇప్పుడు కేవలం 64 లక్షల మంది రైతులకు మాత్రమే అంటున్నారు. తెదేపా హయాంలో 50 వేల కంటే తక్కువ ఉన్న రుణాలను సింగిల్ స్ట్రోక్‌లో మాఫీ చేసామన్నారు. ఇప్పుడు 50 వేలు 5 ఏళ్లలో దశల వారిగా ఇస్తాం అంటున్నారని చెప్పారు. అమ్మ వడి పిల్లలకు బలం అన్నారు. 80 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 40 లక్షల మందికే అమ్మ ఒడి పథకం అంటున్నారు. 
 
మిగిలిన 40 లక్షల మంది బలహీనంగా ఉండాల్సిందేనా అంటూ ప్రశ్నించారు. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ నిధులకు కోత పెట్టారనీ, గృహ నిర్మాణానికి నిధులు తగ్గించారని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ ప్రకారం లక్షా 70 వేలతో ఇల్లు కట్టాలి అంటే రాజీవ్ గృహ కల్ప కూలిపోయే ఇళ్ల కంటే దారుణమైన ఇల్లు ఈ ప్రభుత్వం కట్టాలి అనుకుంటుందన్నారు. 
ప్రతి విషయంలోనూ మాట తప్పుతున్నారు, మడమ తిప్పుతున్నారు అని చెప్పారు. ప్రైవేట్ సంస్థల్లో 80 శాతం స్థానికులకు ఉద్యోగం ఇవ్వాలని ఇప్పటివరకు ఉన్న నిబంధన... మరి ఇప్పుడు 75శాతం అని సర్కార్ అంటుంది... 5 శాతం తగ్గించి యువతకి ఉద్యోగ అవకాశాలు తగ్గించాలి అనుకుంటుంది ఈ ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు. 
 
కోటి 70 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారన్నారు. ఉన్న నిరుద్యోగ భృతి కూడా ఎత్తేసారన్నారు. భూముల ధరలు పెంచేయడంతో కీయా అనుబంధ సంస్థలు అన్ని పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. ఒకపక్క మద్యపాన నిషేధం అంటారన్నారు. మరో వైపు మద్యం ఆదాయం పెంచుకుంటున్నారు. అమరావతి భ్రమరావతి అన్నారన్నారు. ఇప్ప్పుడు మీరు కూర్చుంది ఎక్కడ? మంత్రులు కుయ్ కుయ్ అని తిరుగుతున్న రోడ్లు ఎవరు వేశారు?
 
జగన్ సర్కారు ఇప్పుడు అమరావతిని నిజంగానే బ్రమరావతి చేశారన్నారు. అమరావతిలో పనులు ఆగిపోయి ఖాళీ అయ్యిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సున్నా వడ్డీకే రుణాలు అన్నారు. అయ్యా ఇది కిరణ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వం నుంచి ఉన్నదే అంటూ ఆధారాలు చూపిస్తున్నా. వడ్డీ రుణాలపై సీఎం రాజీనామా చేస్తారా? లేక క్షమాపణ చెప్తారా అంటూ నిలదీశారు. పట్టిసీమని జగన్ దండగ అన్నారు ఆనాడు... ఇప్పుడు పట్టిసీమ పండగ అని చెప్పుకునే పరిస్థితికి ప్రభుత్వం వచ్చిందన్నారు. పట్టిసీమ ద్వారా 260 టీఎంసీల నీరు ఇచ్చాం. కృష్ణా డెల్టాని కాపాడామన్నారు. 

పోలవరంకి నిధులు కేటాయించని ముఖ్యమంత్రి ఎగువ రాష్ట్రం నుంచి నీళ్లు తెస్తా అంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. మన రాష్ట్ర హక్కులు ఫణంగా పెట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టును కట్టడం కరెక్ట్ కాదున్నారు. ఆరోగ్య శ్రీ ని అనారోగ్య శ్రీ గా మార్చబోతున్నారు, 1000 పైన ఖర్చు అయిన ప్రతి జబ్బు ఆరోగ్య శ్రీ కిందకి తీసుకోస్తాం అని 1740 కోట్లు కేటాయించారు. దీనికి కనీసం 5 వేల కోట్లు అవుతుందన్నారు.