శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (12:58 IST)

జగన్‌కు జనం కంటే ధనమే ముఖ్యం: నారా లోకేష్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
 
వైసీపీ నేతల ధనదాహానికి 39 మంది జలసమాధి అయ్యారని, 12 గ్రామాలు నీట మునిగాయని, రూ.1,721 కోట్ల నష్టం వాటిల్లిందని లోకేశ్ పేర్కొన్నారు. 
 
జలప్రళయానికి కారణమైన ఇసుక మాఫియాని కట్టడి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలవడం బాధాకరమన్నారు. బాధితులకు కనీస న్యాయం జరగకముందే కడప జిల్లా నందలూరు మండలం అడవూరు క్వారీలో ఇసుక విక్రయాలు ప్రారంభించారని ఆరోపించారు. 
 
అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల కన్నీళ్లు ఆరకముందే గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు క్యూ కట్టాయని ఆరోపించారు. దీన్నిబట్టి జగన్ కు జనం కంటే ధనమే ముఖ్యమని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.