1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : బుధవారం, 27 మే 2015 (22:01 IST)

ఆ ఇంటిలోకి అడుగుపెట్టగానే షర్టు నుంచి కాలర్ వరకూ తడిసిపోయింది... నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని గండిపేటలో జరుగుతున్న మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన చెప్పుకొచ్చారు. కార్యకర్తలను ఆదుకునేందుకు తను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.
 
ఇంకా నారా లోకేష్ మాట్లాడుతూ... కర్నూలు జిల్లాలో ఓ కార్యకర్త చనిపోతే వారి ఇంటికి వెళ్లాను. ఆ ఇల్లు ఓ రేకుల షెడ్డు. ఆ రేకుల షెడ్డులోకి అడుగుపెట్టాక షర్టు నుంచి కాలర్ వరకూ తడిసిపోయింది. ఆ విధంగా లోపల వేడి ఉంది. ఎండ వేడిమి అలాగే కిందికి దిగుతోంది. వారి పరిస్థితి చూసి ఆవేదన చెందాను. కార్యకర్త భార్య గర్భవతి. ఇంకా వారి పిల్లలను ఆదుకునేందుకు రూ. 2 లక్షల ఇస్తే అందులో రూ. 1.40 లక్షలు అప్పులకే సరిపోయాయి. 
 
కార్యకర్తల బాధలను అధ్యక్షులవారి దృష్టికి తీసుకొచ్చి వారి సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు లోకేష్. అలాగే తెలుగుదేశం కార్యకర్తల కోసం ప్రమాద బీమా ప్రవేశపెట్టిందనీ, ఇపుడు ఇలాంటి పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చారని వెల్లడించారు. కార్యకర్తల పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని కోరుకుంటున్నామనీ, అందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా మోడల్ స్కూలు పెట్టించబోతున్నట్లు చెప్పారు.