మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 17 ఆగస్టు 2020 (20:13 IST)

ఆ విషయం విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుంది జగన్ గారూ? రఘురామకృష్ణ రాజు

న్యాయ వ్యవస్థపై నిఘా అన్న పేరుతో పత్రికల్లో వార్తలు రావడంతో న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాపింగ్‌కు గురవుతున్నాయన్న భావన కలుగుతోందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. “పార్క్ హయత్”లో ఏదో జరిగిందంటూ విజయసాయిరెడ్డి పెట్టిన “ట్వీట్”, చూస్తే ఫోన్ టాంపరింగ్ జరిగింది అనేందుకు నిదర్శనం అన్నారు.
 
ఫోన్ టాపింగ్ జరగకపోతే “ఫేస్ టైం”లో ఎవరెవరు ఎవరితో మాట్లాడారనే విషయం విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుంది? బాబూ ముఖ్యమంత్రి గారూ.. మీ చుట్టూ ఉన్న అసాంఘిక శక్తులు ఎవరనేది పసిగట్టoడి. న్యాయ వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థలను కూలదోస్తున్నారన్న అప్రతిష్ట తెచ్చుకోకండి.
 
టెలిఫోన్ టాపింగ్ అంశంపై మీరు చర్యలు తీసుకోకుంటే, ఇదే అంశాన్ని నేను కచ్చితంగా పార్లమెంట్లో లేవనెత్తుతా అన్నారు. ఆంధ్రజ్యోతి పత్రికకు నోటీసు ఇచ్చిన విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగి ఉండవచ్చు అని, ఆయనకి తెలిస్తే నోటీసులు ఇచ్చేవారు కాదన్నారు. మీ దురభిమానుల ద్వారా నాకు ఫోన్ చేయించి వేధించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.