కొలువుదీరిన "మోడీ 2.O" సర్కారు : భారీ సైజులో మంత్రివర్గం...

namo
Last Updated: గురువారం, 30 మే 2019 (21:35 IST)
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన బీజేపీ కేంద్రంలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మరోమారు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. నరేంద్ర మోడీతో పాటు.. 58 మంది మంత్రులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ప్రధాని మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారి పేర్లను పరిశీలిస్తే,

రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, రాంవిలాస్ పాశ్వాన్, స్మృతి ఇరానీ, ప్రకాష్ జావదేకర్, పియూష్ గోయల్‌లు ఉండగా, వీరిలో అమిత్ షా తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. అలాగే, మొత్తం 58 మంత్రుల్లో 25 మంది కేంద్ర మంత్రులు కాగా, 9 మంది స్వతంత్ర హోదా కలిగిన మంత్రులుగా, 24 మంది కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

అర్జున్ ముండా, హర్షవర్ధన్, ధర్మేంద్ర ప్రధాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రమేశ్ పోఖ్రియాల్,
ప్రహ్లాద్ జోషి, మహేంద్రనాథ్ పాండే, అరవింద్ సావంత్, గిరిరాజ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, సంతోష్ గాంగ్వర్, నరేంద్ర సింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్, హర్ సిమ్రత్ కౌర్ బాదల్, థావర్ చంద్ గెహ్లాట్, జయశంకర్, జితేంద్ర సింగ్, కిరణ్ రిజిజు, రాజ్ కుమార్ సింగ్, హరిదీప్ సింగ్ పూరి, మన్ సుఖ్ మాండవియా, అశ్వినీ కుమార్ చౌబే, అర్జున్ రామ్ మేఘ్వాల్, వీకే సింగ్, కృష్ణ పాల్ గూర్జర్, కిషన్ రెడ్డి, రాందాస్ అథవాలే, నిత్యానంద్ రాయ్, ఫగ్గన్ సింగ్ కులస్తే, సాధ్వీ నిరంజన్ జ్యోతి, శ్రీపాద యశో నాయక్, ధన్వేరావ్ సాహిబ్, పురుషోత్తం రూపాలా, బాబుల్ సుప్రియో, సంజయ్ శ్యామ్ రావు, అనురాగ్ సింగ్ ఠాకూర్, సంజీవ్ కుమార్, రేణుకా సింగ్, అంగాడి సురేశ్, నిత్యానంద్ రాయ్, రామేశ్వర్ తేలి, ప్రతాప్ చంద్ర, వి.మురళీధరన్, సోంప్రకాశ్, కైలాష్ చౌదరి, దేబశ్రీ చౌదరి, రావ్ ఇంద్రజిత్ సింగ్, ప్రహ్లాద్ పటేల్‌లు ఉన్నారు.దీనిపై మరింత చదవండి :