శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: మంగళవారం, 31 మే 2016 (21:58 IST)

జూన్ 2న 11 గంటలకు నవ నిర్మాణ దీక్ష ... సీఎం చంద్ర‌బాబు

అమరావతి: నాడు పార్ల‌మెంట్ తలుపులు మూసేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన చేశారు. ఇపుడు ఏపీకి పూర్తి న్యాయం చేయడం కేంద్రం బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. న‌వనిర్మాణ దీక్ష, మహా సంకల్పం కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు

అమరావతి: నాడు పార్ల‌మెంట్ తలుపులు మూసేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన చేశారు. ఇపుడు ఏపీకి పూర్తి న్యాయం చేయడం కేంద్రం బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. న‌వనిర్మాణ దీక్ష, మహా సంకల్పం కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. సామరస్యంగా, సుహృద్భావంతో సాగాల్సిన విభజన చర్చల్ని కాంగ్రెస్ యుపిఎ వార్ రూమ్ పేరుతో ఉద్రిక్తంగా మార్చాయ‌ని విమ‌ర్శించారు. 
 
సుస్థిర ప్రభుత్వాలు లేని కాలంలోనే రాష్ట్రంలో ఆనాడు సుస్థిర అభివృద్ధి సాధించామ‌ని, జూన్ 2న 11 గంటలకు నవ నిర్మాణదీక్ష ప్రతిజ్ఞ తీసుకోవాల‌ని సీఎం ప్ర‌జ‌ల‌కు విజ్ణ్న‌ప్తి చేశారు. ఆఫీసులో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సరిగ్గా  11 గంటలకు నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాల‌ని సీఎం పేర్కొన్నారు.