శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 24 జూన్ 2017 (07:25 IST)

నెలకు కోటి వసూళ్లు మా వల్ల కాదు కాపాడండి మేడమ్ అన్నాడు.. పీకి పడేశారు..

అవినీతిలో ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం మీద 2వ స్థానంలో ఉందని రెండు రోజుల క్రితమే జాతీయ సర్వేలో ప్రకటించారు. దానికి ఏమాత్రం తగ్గనంటూ ప్రభుత్వం నిరూపించుకుంది కూడా. ఒక డివిజన్‌లోని పోలీసు స్టేషన్‌లలో పని చేసే ఎస్ఐలు ప్రతి నెలా కోటి రూపాయలు వసూలు చేసి ఇవ్వా

అవినీతిలో ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం మీద 2వ స్థానంలో ఉందని రెండు రోజుల క్రితమే జాతీయ సర్వేలో ప్రకటించారు. దానికి ఏమాత్రం తగ్గనంటూ ప్రభుత్వం నిరూపించుకుంది కూడా. ఒక డివిజన్‌లోని పోలీసు స్టేషన్‌లలో పని చేసే ఎస్ఐలు ప్రతి నెలా కోటి రూపాయలు వసూలు చేసి ఇవ్వాలట. కోటి ప్రతి నెలా ఎక్కడి నుంచి తెచ్చి చావాలి. ఈ అవినీతి సొమ్ముతో అధికార పార్టీ నేతలతోపాటు జిల్లా స్థాయి అధికారుల వరకు పంపకాలు జరపాలి. మా వల్ల కాదు మేడమ్ కాపాడండి అంటూ ఓ ఎస్ఐ జిల్లా కలెక్టర్‌కి మొరపెట్టుకున్నాడు. ఆమె అమాయకంగా ఆ లెటర్ని జిల్లా ఎస్పీకి పంపించింది. ఆ ఎస్ఐ ఆవేదన రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర సంచనలం కలగించిది కానీ రాజకీయ పెద్దలు భగ్గుమన్నారు. వెంటనే తమ పరువు బజారులో పెట్టిన ఆ ఎస్సైని బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచారు.
 
విషయం ఏమిటంటే శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎస్‌ఐ ఏకంగా జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా మొరపెట్టుకున్నారు.  ‘నెల నెలా రూ.కోటి టార్గెట్‌ ఇస్తారు.. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వారిని పీడించాలి.. ఇసుకను కూడా మేమే అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి వచ్చిన సొమ్మును అధికార పార్టీ నేతలతోపాటు మా శాఖ అధికారులకు పంపాలి. ఇలా ప్రతి నెలా వసూలు చేయడం మావల్ల కావడం లేదు. మీరైనా చర్యలు తీసుకోండి’... అంటూ అతడు జిల్లా కలెక్టరుకు ఉత్తరం పంపి మొత్తుకున్నాడు.  

ఆ ఎస్‌ఐ ఆవేదన రాజకీయ, అధికారవర్గాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. కానీ దీనిపై రాజకీయ పెద్దలు భగ్గుమన్నారు. ఆ ఎస్‌ఐను బదిలీచేసి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచారు. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం రాష్ట్రంలో తాజా పరిస్థితికి అద్దంపడుతోంది. నెలకు రూ.కోటి వసూళ్లు.. గూడూరు డివిజన్‌ ప్రాంతంలో పోలీస్‌స్టేషన్లలో పనిచేసే ఎస్‌ఐలు ప్రతినెలా రూ.కోటి వరకు వసూలు చేసి ఇవ్వాలి. ఈ అవినీతి సొమ్ముతో టీడీపీ నేతలతో పాటు జిల్లా స్థాయి అధికారుల వరకు పంపకాలు ఉంటాయనేది ఆ ఎస్‌ఐ ఆరోపణ.

ఈ క్రమంలో ఇటీవల సూళ్లూరుపేటలో పనిచేస్తున్న ఎస్‌ఐ నెలవారీ టార్గెట్‌లు వసూళ్లు చేయలేక ఏకంగా  జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఎస్‌ఐ ఫిర్యాదుపై విచారణ జరిపించాల్సిన కలెక్టర్‌ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఉలిక్కిపడ్డ పోలీస్‌ ఉన్నతాధికారులు హుటాహుటినా ఆ ఎస్‌ఐపై బదిలీ వేటు వేశారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వు(వీఆర్‌)లో ఉంచారు.
 
ఇక్కడొక మాట నిజాయితీగా చెప్పుకోవాలి. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయి మరొక ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే  ఈ కోటిరూపాయల కలెక్షన్ల సంస్కృతి ఆగిపోతుందా? ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పోలీసు డిపార్టుమెంట్లలో అవినీతి దందా, వసూళ్ల దందా, బెదిరింపుల దందా, మాట వినకపోతే ఊస్టింగులు వంటివి ఆగుతాయా.. అలా ఎవరైనా హామీ ఇవ్వగలరా?

వ్యవస్థ ఎంతగా పుచ్చిపోయిందంటే.. రాజకీయం, అధికారం రెండూ కలిసి సాగిస్తున్న ఇలాంటి దందాను పెకిలించి పడేసే మొనగాడు పాలకుడు మన దేశం మొత్తం గాలించినా దొరకడు. ఎందుకంటే మన దేశ పాలకవర్గాలకు, వారి తైనాతీలైన నిరంకుశోద్యోగ వర్గాలకు డబ్బు జ్వరం పట్టుకుంది. డబ్బు పిచ్చికి మందులేదు అన్నది అందరికీ తెలిసిన విషయమే.