మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (10:47 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నరుగా జస్టిస్ అబ్దుల్ నజీర్

Abdul Nazeer
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కేంద్రం నియమించింది. అలాగే, పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ గవర్నరుగా ప్రస్తుతం బిశ్వభూషణ్ హరిచందన్ కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కేంద్రం నియమించింది. పైగా, బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నరుగా నియమించింది. 
 
అయోధ్య కేసుతో పాటు ట్రిపుల్ తలాఖ్ కేసులు విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు. ఇటీవలే ఈయన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు గవర్నర్‌గా కేంద్రం నియమించింది.
 
మరోవైపు, తనను బాధ్యతల నుంచి తప్పించాలంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కోరారు. దీంతో ఆయనన్ను గవర్నర్ పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో రమేష్ బియాస్‌ను మహారాష్ట్రకు కొత్త గవర్నరుగా నియమించారు. ప్రస్తుతం కేంద్రం నియమించింన కొత్త రాష్ట్రాల గవర్నర్లను పరిశీలిస్తే, 
 
మేఘాలయ గవర్నర్‌గా చౌహాన్, మణిపూర్ గవర్నరుగా అనసూయ, నాగాలాండ్ గవర్నరుగా గణేశన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా శివప్రసాద్ శుక్లా, అస్సాం గవర్నరుగా గులాబ్ చంద్ కటారియా, జార్ఖండ్ గవర్నరుగా రాధాకృష్ణన్, సిక్కిం గవ్నరుగా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, అరుణాచల్ ప్రదేశఅ గవర్నరుగా త్రివిక్రమ్ పట్నాయక్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.