మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2024 (20:07 IST)

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

ration card
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని భావిస్తుంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై వైకాపా రంగులతో పాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ముద్రించిన విషయం తెల్సిందే. దాంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాత రేషన్ కార్డులలో మార్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో భాగంగా రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులతో పాటు కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. 
 
ఈ దరఖాస్తులను సోమవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీచేస్తారు. ఇప్పటివాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు. ఈ కొత్త రేషన్ కార్డుల ముద్రణ కోసం అవసరమైన బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం కేటాయించిన విషయం తెల్సిందే.