శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (10:17 IST)

డ్రగ్స్‌తోపాటు ఆఫ్రికా అమ్మాయిలతో వ్యభిచారం...

హైదరాబాద్‌లో నైజీరియన్ యువకులు డ్రగ్స్‌తో పాటు ఆఫ్రికన్ అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నారు. కొందరు నైజీరియన్లు డ్రగ్స్‌ విక్రయిస్తున్నారనే సమాచారంతో రాచకొండ ఎస్వోటీ, ఎల్బీ నగర్‌ పోలీసులు నిఘాపెట్టారు

హైదరాబాద్‌లో నైజీరియన్ యువకులు డ్రగ్స్‌తో పాటు ఆఫ్రికన్ అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నారు. కొందరు నైజీరియన్లు డ్రగ్స్‌ విక్రయిస్తున్నారనే సమాచారంతో రాచకొండ ఎస్వోటీ, ఎల్బీ నగర్‌ పోలీసులు నిఘాపెట్టారు. ఈ నిఘా ఫలితంగా రాచకొండ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన నైజీరియన్ల నుంచి వివిధ ఆసక్తికర వివరాలను పోలీసులు తెలుసుకున్నారు.
 
ముఖ్యంగా విద్యాభ్యాసం కోసం హైదరాబాద్‌కు వచ్చే అనేక మంది నైజీరియన్ యువకులు.. డ్రగ్స్ సరఫరాతో యువత పతనానికి కారణమవుతున్నారు. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా వ్యభిచారాన్ని కూడా వీరు నిర్వహిస్తున్నారు. రాచకొండ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన నైజీరియన్ల నుంచి వివిధ ఆసక్తికర వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. 
 
డ్రగ్స్‌ను సరఫరా చేసే క్రమంలో పలువురితో ఏర్పడిన సంబంధాలతో వీరు వ్యభిచారాన్ని కూడా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. డ్రగ్స్‌తో పాటు అమ్మాయిలను కూడా వీరు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం వీరు కోడ్ లాంగ్వేజ్‌ను వాడుతారు. ఇందులో సీవో అంటే కొకైన్‌ కావాలని అర్థం. అలాగే బ్లాక్‌ బెర్రీ అంటే అమ్మాయి అని అర్థం. సీవో విత్ బ్లాక్ బెర్రీ అంటే డ్రగ్స్‌తో పాటు అమ్మాయి కూడా కావాలని అర్థమని విచారణలో గుర్తించారు. 
 
వ్యభిచారాన్ని యాప్రాల్‌ కేంద్రంగా కుషాయి గూడ, ఏఎస్‌ రావు నగర్, జవహర్‌ నగర్, నేరేడ్‌ మెట్‌ లలో నిర్వహిస్తున్నారు. వీరికి గోవాలోని డ్రగ్స్ మాఫియాతో లింకులున్నాయి. నిజాంకాలేజీలో డిగ్రీ చదువుతున్న జాన్, సిరిల్‌‌లతో పాటు సన్‌ సిటీలో కాస్మోస్‌‌ను, మేడ్చల్‌ జిల్లా యాప్రాల్‌‌లోని తిరు అపార్ట్‌మెంట్‌‌లో సిరిల్‌‌ను అరెస్టు చేశారు. 
 
వీరి నుంచి 2,04,000 రూపాయలు, 9,70,000 రూపాయల విలువ చేసే 20 గ్రాముల కొకైన్, 12 గ్రాముల బ్రౌన్‌ షుగర్, 39.8 గ్రాముల అంఫిటమైన్‌ ట్యాబ్లెట్లు, 1.675 కిలోల గంజాయి, 3 ల్యాప్‌ టాప్‌ లు, 6 పాస్‌ పోర్టులు, తొమ్మిది సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరితో మరికొందరికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.