శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 31 జులై 2020 (21:28 IST)

3వ తేదీ నిమ్మగడ్డ అరంగేట్రం, ఆ నిర్ణయం తీసేసుకుంటారా..?

నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. బలమైన ప్రభుత్వంపై పోరాటం చేసి చివరకు విజయం సాధించారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. ప్రభుత్వం బేఖాతరు చేసింది. చివరకు గవర్నర్ ఆదేశాలతో ప్రభుత్వం దిగొచ్చింది. ఎన్నికల కమిషనర్‌గా నియమించింది.
 
అర్థరాత్రి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేస్తారోనన్నది ఆసక్తికరంగా మారుతోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం సిఎంకు ఏ మాత్రం ఇష్టం లేదు. 
 
దీంతో చివరకు చెన్నై నుంచి కనకరాజ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఆ తరువాత రాజకీయ దుమారం రేగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్ళారు. ఆ తరువాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. చివరకు కోర్టు గవర్నర్‌కు సూచిస్తే ఆయన్ను కలిశారు.
 
చిట్టచివరకు గవర్నర్ ఆదేశాలతోనైనా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగష్టు 3వ తేదీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఆశక్తికరంగా మారుతోంది. కరోనా వైరస్ సమయంలో స్థానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసి వైసిపి నేతలకు మింగుడు పడకుండా చేసిన నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని ఏవిధంగా ఇరకాటంలో పెడుతారోనన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.