గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఉరవకొండలో ఘోరం : ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

అనంతపురం జిల్లా ఉరవకొండలో దారుణం జరిగింది. ఆదివారం సాయంత్రం ఉరవకొండ మండలం, బుదగవి వద్ద ఇన్నోవా కారు, లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఓ శుభకార్యానికి వెళ్లి కారులో బళ్లారి నుంచి అనంతపురం తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషురులు ఉన్నారు.
 
కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. మృతులు ఉరవకొండ మండలం, నిమ్మగల్లు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ప్రమాదస్థలం శోకసముద్రంలా మారింది. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో బీజేపీ కిసాన్ రాష్ట్ర నేత కోకా వెంకటప్ప కూడా ఉన్నారు.