శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (21:56 IST)

విశాఖలో దారుణం.. మగబిడ్డకు జన్మనిచ్చిన తొమ్మిదేళ్ల బాలిక

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కఠినమైన చట్టాలు తెచ్చినా మహిళలపై దాడులు ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా విశాఖ పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తాజాగా ఓ కామాంధుడి అకృత్యం కారణంగా మగ బిడ్డకి జన్మనిచ్చింది ఓ మైనర్. 9 వ తరగతి చదువుతున్న ఓ మైనర్ ఏకంగా మగబిడ్డకు జన్మనివ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. 
 
కేజీహెచ్ గైనిక్ వార్డులో అడ్మిట్ అయిన మైనర్… శుక్రవారం మగ బిడ్డకి జన్మనిచ్చింది. అయితే.. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… నిందితుడి కోసం గాలిస్తున్నారు. దీనికి కారణం మర్రిపలెం మండలానికి చెందిన యువకుడు చరణ్ గా అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అనుమానితుడు చరణ్.