ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (08:33 IST)

వేలానికి నీరవ్ మోడీ ఆస్తులు

పరారీలో ఉన్న వ్యాపారవేత్త నీరవ్‌ మోడీకి చెందిన జప్తు చేసిన ఆస్తులను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఈడీ వేలానికి సిద్ధమైంది.

త్వరలోనే ముంబైలో జరగనున్న రెండు వేలంపాటల్లో నీరవ్‌కు చెందిన కొన్ని వస్తువులను వేలంపాట వేయనున్నారు. వేలంవేయనున్న వస్తువుల జాబితాలో అత్యంత విలాసవంతమైన, ఖరీదైన లగ్జరీ వాచీలు, బ్యాగులు, కార్లు ఉన్నాయి.

ముంబైలోని సఫ్రానట్స్‌ ఆక్షన్‌ హౌస్‌లో త్వరలో వేలంపాట జరగనుంది. ఫిబ్రవరి 27 తొలి దఫా వేలంపాట, మార్చి 3-4 తేదీల్లో రెండవ దఫా వేలంపాటను నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో భారతీయ చరిత్రకు చెందిన కొన్ని కళాకృతులను కూడా వేలానికి ఉంచనున్నారు.