శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:46 IST)

ఏపీ సీఎం జ‌గ‌న్ ని క‌లిసిన నీతి ఆయోగ్ బృందం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నీతి ఆయోగ్‌ బృందం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2020-21 రిపోర్టును సీఎంకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, వివిధ రంగాల అభివృద్దికి ఇస్తున్న ప్రాధాన్యతను సీఎం వైఎస్‌ జగన్‌ నీతిఆయోగ్‌ సభ్యులకు వివరించారు. మానవాభివృద్ధి సూచికలో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏపీ 3వ స్థానంలో ఉందని.. త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటామని ఏపీ ప్రభుత్వం నీతి ఆయోగ్‌కు స్పష్టం చేసింది.

నీతిఆయోగ్‌ ఆధ్వర్యంలో సచివాలయంలో సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డీజీస్‌) ఇండియా ఇండెక్స్‌ 2020–21, మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌(ఎంపీఐ)పై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఎంపీఐ ర్యాంకింగ్‌లో భారత్‌ 62వ స్థానంలో ఉందని నీతి ఆయోగ్‌ సలహాదారు వెల్లడించారు. ఎస్‌డీజీ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రాన్ని మొదటి స్ధానంలో నిలిపేందుకు ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన నీతిఆయోగ్ టీమ్ లో సలహాదారు శాన్యుక్తా సమద్దార్, నీతిఆయోగ్‌ ఎస్‌డీజీ ఆఫీసర్‌ అలెన్‌ జాన్, నీతిఆయోగ్‌ డేటా ఎనలటిక్స్‌ ఆఫీసర్‌ సౌరవ్‌ దాస్, ఏపీ ప్రణాళికాశాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్ ఉన్నారు.