గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (10:41 IST)

డ్యూటీ చేస్తే నో డ్యూటీ స‌ర్టిఫికేట్స్... హ‌వ్వ‌... ఇదేం కృష్ణా పుష్క‌ర సంస్కృతి

విజ‌య‌వాడ ‌: ప‌న్నెండు రోజుల పాటు కృష్ణా పుష్క‌రాలు ఘ‌నంగా జ‌రిగిపోయాయి. ఎన్నో విభాగాల వారు, స్వ‌చ్చంద సంస్థ‌ల వారు అకుంఠిత దీక్ష‌తో ప‌నిచేసి కృష్ణా పుష్క‌రాల‌ను గ‌ట్టెక్కించారు. అయితే, ఇపుడు వారంద‌రి

విజ‌య‌వాడ ‌: ప‌న్నెండు రోజుల పాటు కృష్ణా పుష్క‌రాలు ఘ‌నంగా జ‌రిగిపోయాయి. ఎన్నో విభాగాల వారు, స్వ‌చ్చంద సంస్థ‌ల వారు అకుంఠిత దీక్ష‌తో ప‌నిచేసి కృష్ణా పుష్క‌రాల‌ను గ‌ట్టెక్కించారు. అయితే, ఇపుడు వారంద‌రికీ స‌ర్టిఫికేట్లు ఇచ్చే విష‌యంలో జోకులు పేలుతున్నాయి. కృష్ణా కలెక్ట‌ర్ అహ్మ‌ద్ బాబు కృష్ణా పుష్క‌రాల్లో డ్యూటీలు చేసిన వారికి ప్ర‌శంసా ప‌త్రాలు, డ్యూటీ స‌ర్టిఫికెట్లు అందిస్తున్నారు. 
 
ప్ర‌భుత్వం త‌ర‌ఫున చేస్తున్న ఈ కార్య‌క్ర‌మంలో స్పెల్లింగ్ మిస్టేక్ దొర్లింది. ఆన్‌డ్యూటీ సర్టిఫికేట్‌కి బ‌దులు నో డ్యూటీ అని అచ్చ‌యింది. ఇది చూసి హ‌వ్వ‌... డ్యూటీ చేయ‌నివారికి కూడా ఇలా స‌ర్టిఫికెట్లా అని న‌వ్విపోతున్నారు. ప్లీజ్ ఈ స్పెల్ చెక్ చేసుకోరూ అధికారులూ!