1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (13:43 IST)

ఎన్పీఏలు పెరిగిపోయాయ్ : ఆంధ్రాబ్యాంక్ సీఎండీ

ఇటీవలి కాలంలో నిరర్థక ఆస్తులు బ్యాంకులకు పెద్ద తలనొప్పిగా పరిణమించిన సంగతి తెలిసిందే. సినీ తారలు,
రాజకీయ నాయకుల వల్లే తమ బ్యాంకులో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగిపోయాయని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికం (క్యూ3) ఫలితాలు వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా రాజేంద్రన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను చెల్లించాలని సూచించారు. లేని పక్షంలో రైతులు తనఖా పెట్టిన బంగారాన్ని వేలం వేస్తామని హెచ్చరించారు. 
 
కాగా రాజేంద్రన్ వ్యాఖ్యలను బట్టి రైతు రుణమాఫీపై ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధి బయటపడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.