గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (05:32 IST)

ఒక్క క్షణం తీరిక లేదు: ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

కరోనా వైరస్ ను నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ముందుకు వెళుతున్నట్టు ఏపి ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

కరోనాను తరిమి కొట్టడానికి రాష్ట్రములో ప్రభుత్వ ఉద్యోగులు, సేవలు మరువలేనివని, క్రమశిక్షణతో, అంకిత భావంతోవైద్యులు, శానిటేషన్ సిబ్బంది, ఆశ వర్క్లు, పోలీస్, రెవిన్యూ, వివిధ శాఖల అధికారులు, మీడియా ఎంతగానో కృషి చేస్తున్నారని మంత్రి చేప్పారు.

ఎంతోమంది ధాత్రుత్వం, మానవత్వం కలిగిన దాతలు ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు రూపంలో ఆర్ధిక సహాయం చేస్తునారని వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదములు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.

రాష్ట్రములో లాక్ డౌన్ ప్రకటన చేయక ముందు నుండి కరోనా నివారణకు రాష్ట్రమంతా విస్తృతoగా పర్యటించిన మంత్రి ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గంలో కరోనా పరిస్థితులు స్వయంగా తెలుసుకోవడానికి ఏలూరు వచ్చారు.

ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచేo మై బాబు, నిమ్మకాయలు వర్తకసంఘం అధ్యక్షులు ఉప్పలపాటి చక్రపాణి, గ్రీన్ సిటీ రాజు మంత్రి ఆళ్ల నానిని కలిసి సీఎం సహాయ నిధికి 2లక్షలు రూపాయలు చెక్ ను అందచేసారు.

ఈ సందర్బంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతు... కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రజలను ఆర్ధికంగా ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం కాపాడడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూన్నామని, కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికీ వైద్య పరీక్షలు, వైద్యం అందిస్తూన్నామని, ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని, దాదాపు గా 3వేల మంది వైద్యులు సేవలు అందిస్తున్నారని మంత్రి ఆళ్ల నాని వివరించారు.

అదే విధంగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతంలో కంటైన్మెంట్ వ్వుహం కొనసాగుతున్నదని, హాస్పిటల్స్ లో సదుపాయాలుగణనీయంగా పెంచుతున్నామని, క్రిటికల్ కేర్ కోసం 4అత్యదునిక హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నామని, 13 జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక కోవిడ్ హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

జిల్లాల్లో వీటికి అదనoగా మరో 78 హాస్పిటల్స్ ముఖ్యమంత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయిoచారని. సమర్ధవoతంగా క్వారo టైన్ చేయడానికి ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్లు, ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో 26వేల బెడ్స్ సిద్ధంగా ఉంచండo జరిగిందని, కరోనా వైరస్ సోకిన మండలాల్లో 37రెడ్ జోన్స్, 670 వెంటిలెటర్లు, అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 

ప్రస్తుతం మూడో దశ సెర్వే ప్రారంభించామని, ఈ సెర్వేలో ఇప్పటి వరకు 12వేలకు పైబడి అనుమానితులుగా గుర్తించామని, వారిలో 1, 794మందిని గృహ నిర్భoధలో ఉంచామని పేర్కొన్నారు. కరోనా నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, గుంటూరులో మొట్ట మొదటకరోనా పాజిటివ్ వ్యక్తికి కరోనా తగ్గి నెగటివ్ రిపోర్ట్ రావడమే కాకుండా, రెండోవ టెస్ట్ లో కూడా నెగటివ్ రావడంతో వారు డిశార్జి అయినట్లు మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.