శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (11:31 IST)

రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ - పురంధేశ్వరి వెల్లడి

ntramarao
భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని రూ.100 నాణెంపై ఆయన బొమ్మను ముద్రించేందుకు సమ్మతం తెలిపింది. ఈ విషయానని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆమె తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ, త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న రూ.100 కరెన్సీ నాణెం వాడుకలోకి రానుందని చెప్పారు. అలాగే, ఎన్టీఆర్‌కు భారత రత్న పురస్కారం ప్రదానం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన తండ్రి తన రాజకీయ జీవితాన్ని తిరుపతి నుంచే ప్రారంభించారని చెప్పారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మరో పది నెలల పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ వేడుకలకు హాజరుకావాలని ఆమె పిలుపునిచ్చారు.