గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (14:26 IST)

పవన్ కల్యాణ్ ఫోటోకు పాలాభిషేకం చేసిన వృద్ధురాలు.. నా కుమారుడు అంటూ..? (video)

Pawan kalyan
Pawan kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తున్నారు. కబ్జాకి గురైన తన స్థలాన్ని తిరిగిన ఇప్పించిన పవన్ ఫోటోకు ఓ వృద్ధురాలు పాలాభిషేకం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ తన కుమారుడు అంటూ ఆ వృద్ధురాలు చెప్పింది. తన భూమిని తనవారే కబ్జా చేశారంటూ పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఫిర్యాదును స్వీకరించిన పవన్ కల్యాణ్.. వారం రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరించారు. సంబంధిత భూపత్రాలను పరిశీలించి.. కబ్జా అయిన భూమిని సొంతమైన వృద్ధురాలికే అందజేశారు. సమస్యను తెలుసుకుని తన కొడుకులా ఆ సమస్యను పరిష్కరించిన పవన్‌పై ప్రశంసలు కురిపించింది. ఇంకా ఆయన ఫోటోకు పాలాభిషేకం చేసింది. 
 
పవన్ కల్యాణ్ లాంటి నాయకుడు పిఠాపురంకు రావడం మన అందరి అదృష్టమని కొనియాడింది. ఈ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటుచేసుకుంది.