విశాఖలో దారుణం.. కరోనా బారిన పడి చిన్నారి మృతి
విశాఖలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. ఏడాది చిన్నారి కరోనా బారినపడి కన్నుమూసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకక వేచి చూసి ఆ చిన్నారి ప్రాణాలను కోల్పోయింది.
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగానే.. మొదట ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు తల్లిదండ్రులు.. అయితే, లక్షలాది రూపాయలు కట్టించుకొని ప్రాణాల మీదకు వచ్చే సరికి చేతులెత్తేసిన ప్రైవేట్ ఆస్పత్రి.. ఇక, తమ నుంచి కాదంటోంది.
దీంతో.. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని కేజిహెచ్‌సి ఎస్‌ఆర్ బ్లాక్‌కు తరలించారు తల్లిదండ్రులు. సిఎస్‌ఆర్‌బ్లాక్‌లో బెడ్స్ ఖాళీ లేకపోవడంతో గంటకు పైగా అంబులెన్సు లోనే చిన్నారి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడింది.
మరోవైపు, సి ఎస్సార్ బ్లాక్ వద్ద పదుల సంఖ్యలో క్యూ కట్టాయి అంబులెన్సులు.. బెడ్స్ లేక.. అంబులెన్స్‌లోనే పడిగాపులు పడుతున్నారు.. ఈ నేపథ్యంలోలో ఆస్పతిలో చేరకుండానే ఆ చిన్నారి మృతిచెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.