Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏమండీ.. మరిది వేధిస్తున్నాడు.. పట్టించుకోని భర్త.. వివాహిత అనుమానాస్పద మృతి

మంగళవారం, 27 జూన్ 2017 (11:37 IST)

Widgets Magazine
deadbody

ఒంగోలు జిల్లా గుడ్లూరు మండలం రావూరు గ్రామానికి చెందిన ఓ వివాహిత అనుమానాస్పదంగా చనిపోయింది. ఆమె చనిపోయిన రెండు రోజులకే ఆమె మరిది ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానం రేకెత్తిస్తోంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే ఈ గ్రామానికి చెందిన ప్రమీల అనే మహిళ భర్తతో కలిసి ఉంటోంది. ఈ ఇంటిపక్కనే ఆమె మరిది మిరియం బంగారయ్య (36) కూడా నివాసం ఉంటున్నాడు. అయితే, అన్న లేని సమయంలో వదినను లైంగికంగా వేధిస్తూ వచ్చినట్టు సమాచారం.
 
ఈ విషయాన్ని ఆమె భర్త దృష్టికి తీసుకెళ్లినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. అదేసమయంలో ఆమె రెండు రోజుల క్రితం అనుమానాస్పదస్థితిలో  మరణించింది. ఇపుడు వదిన చనిపోయిన రెండు రోజులకే బంగారయ్య కూడా చనిపోవడం చర్చనీయాంశమైంది.
 
గ్రామస్తులంతా మరిది చేష్టలను భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించగా ఆమె తల్లిదండ్రులు బంగారయ్యే మా బిడ్డ మృతికి కారణమని ఆరోపించారు. తనపై పోలీసు కేసు పెట్టిందన్న కసితో బంగారయ్యే ఆమెను హత్య చేసి ఉరేసి ఉంటాడన్న అనుమానాలున్నాయి.
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో తనను ఎక్కడ అరెస్టు చేస్తాడన్న భయంతో బంగారయ్య ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జూలై 2తో ముగుస్తుంది.. ఆ తర్వాత ఎక్కడుంటానో తెలియదు : స్మృతి ఇరానీ

తన రాజకీయ భవిష్యత్‌పై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికరమైన సమాధానం ...

news

ఆరడుగుల శిరీషను ఇద్దరు లొంగదీసుకోవడమా? షర్ట్ బటన్‌లు అలా వున్నాయి..

ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీషను ఒక్కరో లేక ఇద్దరో ఏమీ చేయలేరని ...

news

నోవాటెల్ హోటల్‌లో 7 గంటలున్న భరత్... ఏం చేశాడో వెల్లడించని ఖాకీలు...

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు హైదరాబాద్ నోవాటెల్ ...

news

మెడకు వైరు బిగించి చంపేశారు.. : శిరీష మేనమామ

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష కేసులో ఆమె మేనమాన తీవ్రఆరోపణలు ...

Widgets Magazine