మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి: మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
కరోనా వ్యాప్తి నివారణకు వైసిపి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయాశాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఒక్కరూ వారివారి ఇళ్ళకే పరిమితమై లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తే కరోనాను పారద్రోలవచ్చని పిలుపునిచ్చారు.
గవర్నరుపేటలోని ది రైస్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 23వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి ఆత్మకూరి సుబ్బారావు సహకారంతో శనివారం వెయ్యి కిలోల బియ్యాన్ని 200 మంది పేదలకు అందించే దిశగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రం కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో తమ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కృషి చేస్తుందని ఈ క్రమంలోనే బియ్యం మూడు థఫాలుగా, శనగలు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తుందన్నారు.
కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సహాయం అందించేందుకు ది రైస్ మర్చంట్స్ అసోసియేషన్ ముందుకు రావటం ముదుస్వభావం అన్నారు.
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రతి అసోసియేషన్ తమ వంతు బాధ్యతగా కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు ముందుకు రావటం సంతోషకరమన్నారు. అనంతరం 23వ డివిజన్ వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి ఆత్మకూరి సుబ్బారావు మాట్లాడుతూ 200 పేద కుటుంబాలకు బాసటగా నిలవాలన్న ఉద్దేశ్యంతో వెయ్యి కిలోల బియ్యాన్ని డివిజన్ లోని ఇంటింటికీ డోర్ డోర్ పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.
కార్యక్రమంలో ఒగ్గు విక్కి, చల్లా సుధాకర్, ఎస్. మురళీ, శివారెడ్డి, దామర్ల మురళీ, సి. హెచ్. పండు, శెట్టి అంజిబాబు, గొంట్ల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.