శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (14:12 IST)

పట్టాభిని కస్టడీకి అప్పగించాలి : కోర్టులో పిటిషన్ - చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బోషడీకే అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్‌ను ఇటీవ‌ల పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు కొన్ని గంటల్లోనే బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం ఆయన మాల్దీవులకు వెళ్లారు. 
 
ఈ నేపథ్యంలో ఆయ‌న‌ను త‌మ క‌స్ట‌డీకి అప్ప‌గించాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ వేయ‌గా దాన్ని గురువారం కోర్టు కొట్టివేసింది. పోలీసుల పిటిష‌న్‌ను డిస్మిస్ చేస్తున్న‌ట్లు విజ‌య‌వాడ కోర్టు పేర్కొంది. ఇటీవ‌ల జ‌గ‌న్‌పై ప‌ట్టాభి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కారణంగా, చోటుచేసుకున్న తదనంతర ప‌రిణామాల వ‌ల్ల‌ ఏపీ వ్యాప్తంగా క‌ల‌క‌లం చెల‌రేగిన విష‌యం తెలిసిందే.