శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (05:51 IST)

కేంద్రం ఇస్తుందనే నమ్మకం ఉంది..! కొన్నాళ్లు వేచి చూద్దాం... ప్రత్యేకహోదాపై పవన్ ట్వీట్స్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కేంద్రం ఇస్తుందనే తాను నమ్ముతున్నట్లు జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆయన తొలిసారిగా ప్రత్యేకహోదా స్పందించారు. ఈ విషయంలో మరికొంతకాలం వేచిచూద్దామని సూచించారు. 
 
‘హోదా’పై శనివారం వైసీపీ బంద్‌ ఇచ్చిన నేపథ్యంలో... శుక్రవారం పవన్‌ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘హోదాపై ఇంకొంతకాలం వేచిచూద్దాం. అప్పటికీ న్యాయం జరుగని పక్షంలో దానిని ఎలా సాధించాలో ఆలోచిద్దాం.’’ అని పవన్‌ ట్వీట్‌ చేశారు.