శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 జులై 2023 (16:10 IST)

జగ్గూ భాయ్‌ను ఇంటికి పంపే సమయం వచ్చింది : పవన్ కళ్యాణ్

pawan kalyan
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో పేరు పెట్టారు. జగన్‌కు ఆయన జగ్గూభాయ్ అనే పేరు పెట్టారు. ఈ జగ్గు భాయ్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైందంటూ హెచ్చరించారు. గురువారం ఆయన తాడేపల్లిగూడెంలో జనసేన వీరమహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌‍పై మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. 
 
జగ్గూభాయ్‌ని ఇంటికి పంపే రోజు వచ్చిందన్నారు. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు. జగన్ పదేపదే పెళ్లా పెళ్లాం అంటుంటే ఆ భాష చూస్తుంటే చిరాకేస్తుందన్నారు. నా భార్యను అంటే పట్టించుకోను. నన్ను, నా కుటుంబాన్ని అన్నా నాకు కోపం రాదు. ప్రజలను అంటే మాత్రం కోపం వస్తుంది. జనసేన కార్యకర్తను మహిళా సీఐ అంజు యాదవ్ చెంప ఛెళ్లుమనిపించడం చాలా బాధేసిందన్నారు. అందుకే తాను శ్రీకాళహస్తికి వెళ్లనున్నట్టు చెప్పారు. జగన్ వాడుతున్న భాష చూస్తుంటే చిరాకు వేస్తుందన్నారు. తన వివాహాలకు సంబంధించి విడాకులు తీసుకున్నానని, కానీ, జగన్ మాత్రం తన పెళ్లిళ్లను పట్టుకుని అక్కడే ఉన్నారని మండిపడ్డారు. 
 
అద్భుతాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదని.. పేదల బతుకులు మార్చాలనే వచ్చానని చెప్పారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకే పోరాడుతున్నట్లు చెప్పారు. 'రాజకీయాల్లో ప్రలోభాలను దాటుకొని ముందుకు వెళ్తున్నాం. రాజకీయాల్లో ఎదురుదాడి అలవాటు చేసుకోవాలి. మనం ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదు. 
 
అద్భుతాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. పేదల బతుకులు మార్చాలని వచ్చా. నేను, నా కుటుంబం ఎందుకు విమర్శలు ఎదుర్కోవాలి? సమాజంపై ప్రేమతో నా ప్రాణం, కుటుంబాన్ని పణంగా పెట్టి వచ్చా. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు.. సచివాలయ వ్యవస్థ దేనికి? రాష్ట్రంలో అవినీతి నిత్యకృత్యమైపోయింది. నా అభిమాని అయినా సరే.. మాన, ప్రాణాలకు భంగం కలిగిస్తే శిక్షించాలి' అని పవన్‌ అన్నారు.