శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (18:04 IST)

ఆన్‌లైన్ టిక్కెటింగ్‌కు సినీ పెద్దలు సమ్మతించారు : మంత్రి ఆదిమూలపు

తెలుగు చిత్రపరిశ్రమలో సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు సినీ పెద్దలే సమ్మతించారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పుకొచ్చారు. అదేసమయంలో ఆన్‌లైన్ టికెటింగ్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమ వారికే నచ్చడం లేదన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఆన్‌లైన్ టిక్కెట్ల విషయంలో సినీ పరిశ్రమ మొత్తం ఒక క్లారిటీతో ఉందన్నారు. కానీ, పవన్ మధ్యలో వెళ్లి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కేవలం సినీ పరిశ్రమకే కాకుండా మొత్తం రాష్ట్రానికే గుదిబండగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్... కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తుండటం దారుణమని అన్నారు. ఎవరి కోసం పోరాడుతున్నారో, ఏ అజెండాతో ముందుకు వెళ్తున్నారో పవనే అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికలు వస్తే ఏదో ఒక అలజడి సృష్టించాలనే ఆలోచనతో పవన్ వ్యవహరిస్తుంటారని, ఆయన వాడుతున్న భాష, ఆలోచనా విధానం ప్రమాదకరంగా వున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు.