గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జూన్ 2022 (10:36 IST)

అక్టోబ‌ర్ 5 నుంచి పవన్ కల్యాణ్ బస్సు యాత్ర

pawan kalyan
అక్టోబ‌ర్ 5 నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యా‌ణ్ బ‌స్సు యాత్ర ప్రారంభం కానుంద‌ని జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటి (పీఏసీ) చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్ర‌క‌టించారు.

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ప‌వ‌న్ బస్సు యాత్ర సాగుతుంద‌ని నాదెండ్ల ప్ర‌క‌టించారు. 
 
అక్టోబ‌ర్ 5న తిరుప‌తి నుంచి ప‌వ‌న్ త‌న బ‌స్సు యాత్ర‌ను ప్రారంభిస్తార‌ని ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భ‌గా 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి కూడా నాదెండ్ల కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 
 
ఎన్నికలు 2023లోనే జ‌ర‌గబోతున్నాయ‌ని నాదెండ్ల తెలిపారు. ఈ క్ర‌మంలో పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాల‌ని నాదెండ్ల పిలుపునిచ్చారు.