గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 17 మార్చి 2017 (11:38 IST)

పవన్ కళ్యాణ్ చెప్పిన మాట నిజమేనా? ఉత్తరాది అహంకారం... మోదీ అలా ఎందుకు చేస్తున్నారు?

జనసేన పార్టీ చీఫ్ ఎప్పుడు మాట్లాడినా ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడుతుంటారు. ఉత్తరాది అహంకారం అని అంటారు. ఉత్తరాదిన పాలించేవారికి దక్షిణాది కనబడటం లేదని చెపుతుంటారు. ఇది నిజమేనేమో అనుకోవాల్సి వస్తోందంటున్నారు రాజకీయ నిపుణులు. ఎందుకంటే తాజాగా ఉత్తరప

జనసేన పార్టీ చీఫ్ ఎప్పుడు మాట్లాడినా ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడుతుంటారు. ఉత్తరాది అహంకారం అని అంటారు. ఉత్తరాదిన పాలించేవారికి దక్షిణాది కనబడటం లేదని చెపుతుంటారు. ఇది నిజమేనేమో అనుకోవాల్సి వస్తోందంటున్నారు రాజకీయ నిపుణులు. ఎందుకంటే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భాజపా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలోని రైతుల రుణాలు మాఫీ చేస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో చెప్పారు. 
 
ఇప్పుడు ఆ రాష్ట్రంలో రుణ మాఫీ చేసేందుకు సిద్ధమయిపోయారు. కానీ రుణ మాఫీ అంటూ హామీలిచ్చిన తెలుగుదేశం, తెరాస పార్టీలు ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో అది అమలు చేయలేక తంటాలు పడుతున్నాయి. నిధుల కొరతతతో సతమతమవుతున్నాయి. ఎన్నోమార్లు కేంద్రాన్ని కలిసి రుణమాఫీకి నిధులు కేటాయించాలని అడిగితే మొండిచెయ్యి చూపించింది. కేంద్ర వైఖరితో ఆర్బీఐ కూడా రుణమాఫీ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు సహాయం చేసేందుకు నిరాకరించిందని సమాచారం. రుణ మాఫీ కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ వైపు గగ్గోలు పెడుతుంటే, యూపీలో మాత్రమే అమలు చేసేందుకు కేంద్రం ముందడుగు వేస్తుండటంపై ఏపీ, తెలంగాణలు గుర్రుగా వున్నాయి. మరి ఎన్నికల నాటికైనా రుణమాఫీలో మోదీ చేయూతనిస్తారేమో చూడాల్సి వుంది.