అయోధ్య రామాలయానికి జనసేనాని రూ.30 లక్షల విరాళం  
                                       
                  
				  				  
				   
                  				  అయోధ్య రామాలయం నిర్మాణానికి భారీగా విరాళాలను అందించే ప్రక్రియ ప్రారంభమైంది. రామాలయ నిర్మాణం కోసం బీజేపీ, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా నిర్వహిస్తున్నారు. రామాలయ నిర్మానంలో అందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతోనే విరాళాలు సేకరిస్తున్నారు. ఎవరికి తోచినంత వారు ఇవ్వాలని చెబుతున్నారు. 
 				  											
																													
									  
	 
	రాజకీయ నాయకులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ కూడా తన వంతు సాయంగా రూ.30 లక్షల రూపాయలను అయోధ్య రామాలయ నిర్మాణానికి ఇస్తున్నట్లు ప్రకటిచారు.
				  
	 
	''ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు. సహనం, శాంతి, త్యాగం, శౌర్యం.. ఈ దేశం ఎలాంటి దాడులు, ఒడిదుడుగులు ఎదురైనా మన దేశం బలంగా నిలబడగలిగింది అంటే శ్రీరాముడు చూపిన మార్గమే. ఈ దేశం ఎలాంటి దాడులు, ఒడిదుడుగులు ఎదురైనా మన దేశం బలంగా నిలబడగలిగింది అంటే శ్రీరాముడు చూపిన మార్గమే. పరమత సహనం మనదేశంలో ఉందంటే అది ఆయన చూపిన దారే. అందుకే రామరాజ్యం అన్నారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	అన్ని మతాల వారు, ప్రాణకోటి సుఖంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామాలయం కడుతుంటే భారతీయులంతా పిల్లాపాపలంతా విరాళాలు ఇస్తున్నారు. నా వంతుగా రూ.30 లక్షలు ఇస్తున్నా.'' అని పవన్ తెలిపారు.