గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 23 జనవరి 2019 (16:30 IST)

పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే తాటతీస్తా : టీజీకీ పవన్ హెచ్చరిక

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదంటూ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బాగుండన్నారు. పెద్దమనిషి కదా అని మర్యాదనిస్తున్నట్టు తెలిపారు. 
 
టీజీ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలిపెట్టబోమని, బుద్ధిచెబుతామని హెచ్చరించారు. తాము వద్దనుకుంటేనే టీజీ వెంకటేశ్‌కు చంద్రబాబు రాజ్యసభ సీటును ఇచ్చారని గుర్తుచేశారు. 'నా నోరు అదుపుతప్పితే మీరు ఏమవుతారో కూడా నాకు తెలియదు' అని ఘాటైన హెచ్చరికలు చేశారు. 
 
టీజీ వెంకటేశ్ తన వయసుకు తగ్గట్లు పెద్దమనిషిగా మాట్లాడాలనీ, లేదంటే తాను నోరు అదుపుతప్పి మాట్లాడాల్సి వస్తుందన్నారు. కర్నూలులో పర్యావరణాన్ని అడ్డగోలుగా కలుషితం చేస్తున్నారని దుయ్యబట్టారు. పెద్దమనిషి అనే మర్యాద ఇస్తున్నానని అన్నారు.
 
ఏపీని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో తాను మద్దతు ఇస్తే టీడీపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇందుకోసం టీడీపీ నుంచి తాము ఏదీ ఆశించలేదని గుర్తుచేశారు. టీడీపీ వ్యవహారశైలితో విసిగిపోయామనీ, ఆ పార్టీ ఇప్పుడు మళ్లీ ఎలక్షన్ గేమ్ మొదలుపెట్టిందని పవన్ అన్నారు.