శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 31 జులై 2017 (13:54 IST)

పవన్ అభినందనీయుడు.. పాలకులుగా మేం చేయలేకపోయాం : చంద్రబాబు

ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలను తగ్గించేందుకు తక్షణం మరిన్ని చర్యలు తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. సోమవారం ఉదయం పవన్‌తో పాటు హ

ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలను తగ్గించేందుకు తక్షణం మరిన్ని చర్యలు తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. సోమవారం ఉదయం పవన్‌తో పాటు హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి వచ్చిన వైద్య బృందంతో వెలగపూడి సచివాలయంలో చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెల్సిందే. 
 
ఈ సందర్భంగా ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎం హార్వర్డ్ వర్శిటీ నిపుణుల బృందానికి వివరించారు. ఆపై వర్శిటీ ప్రొఫెసర్లు ఇచ్చిన ప్రజెంటేషన్‌ను విని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలన్నదే తమ అభిమతమని తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరింత ఉపశమనాన్ని కల్పించాలన్న కృతనిశ్చయంతో ఉన్నామని సీఎం అన్నారు. 
 
ఇప్పటికే ఉచిత డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇక మరెవరికీ వ్యాధులు సోకకుండా చేసేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని పీకేకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. చిన్న వయసు నుంచే రక్షిత మంచినీటిని మాత్రమే తాగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. గత పాలకులు సమస్యకు కారణాలను కొనుగొనలేక పోయారని, దీనిపై ముందుకు కదిలిన పవన్ కల్యాణ్ అభినందనీయుడని చంద్రబాబు అన్నారు. 
 
కాగా, సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సుమారు గంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉద్దానం కిడ్నీ సమస్యతో పాటు.. పోలవరం, రాజధాని, మంజునాథ్ కమిషన్ సహా.. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఉద్దానంలో కిడ్నీ సమస్య 30 ఏళ్లుగా ఉందని.. వ్యాధికి సరైన కారణాలు ఇంతవరకు కనుగొనలేకపోయారని సీఎం గుర్తు చేసారు.