సోమవారం, 6 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (16:35 IST)

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

pawan kalyan
నానీ పాల్కివాలా గారు రచించిన We The Nation అనే పుస్తకం తనలో రాజకీయ చైతన్యాన్ని కలిగించడానికి ప్రేరణగా నిలిచిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన తన పుట్టిన రోజు వేడుకలను మంగళవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తనకు బర్త్ డే విషెస్ చెప్పిన తన చిన్న అన్నయ్య నాగబాబు, పెద్ద అన్నయ్య చిరంజీవిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 
 
ముఖ్యంగా, తన సోదరుడు నాగబాబు పెట్టిన పోస్టుకు పవన్ ఆసక్తికరంగా స్పందించారు. "హృదయపూర్వక ధన్యవాదాలు చిన్నన్నయ్యా.. మీరు లా చదివే సమయంలో బహుమతిగా ఇచ్చిన నానీ పాల్కివాలా గారు రచించిన We The Nation అనే పుస్తకంలో నాలో రాజకీయ చైతన్యాన్ని కలిగించడానికి ప్రేరణగా నిలిచింది. ఎమ్మెల్సీగా, జనసేన ప్రధాన కార్యదర్శిగా ప్రజా జీవితంలో మ సేవలు విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. 
 
దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్ 
 
తన తమ్ముడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 2వ తేదీన పవన్ కళ్యాణ తన బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి కూడా తన ఎక్స్ వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 
 
"చనలచిత్ర రంగంలో అగ్రనటుడుగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాషుష్మాన్ భవ పవన్ కళ్యాణ్" అంటూ పేర్కొన్నారు.