ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (18:30 IST)

పొత్తుల విషయంలో నేనే నిర్ణయం తీసుకుంటాను.. పవన్ కల్యాణ్

pawan klyan
జనసేన సిద్ధాంతాలను కలుషితం చేసేందుకు, తమ దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా జనసేన పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. 
 
కొన్ని పార్టీలు జనసేనకు అనుకూలంగా ఉండగా, పార్టీ సానుకూల ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కట్టుకథలను ప్రచారం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందని పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
 
ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయవద్దని, సరైన కారణం లేకుండా కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవద్దని పవన్ హెచ్చరించారు. పొత్తుల విషయంలో తానే నిర్ణయం తీసుకుంటానని, సోషల్ మీడియాలోని సమాచారం ఆధారంగా పొత్తులపై చర్చించవద్దని పార్టీ సభ్యులకు కళ్యాణ్ సూచించారు. 
 
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని, ఈ లక్ష్యాలపై దృష్టి సారించడం చాలా అవసరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.