జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్, లోకేష్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ మాజీ సీఎం జగన్, ప్రధాని మోదీ తదితరులు స్పందించారు. వీరి అందరికీ పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
అరకు పర్యటనలో ఉన్న పవన్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. స్పందించిన ప్రతీ ఒక్కరికి కూడా థ్యాంక్స్ తెలిపారు. ఏపీ మాజీ సీఎంకు కూడా థ్యాంక్స్ చెప్పడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అంతకుముందు "సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి షాక్ అయ్యాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబం గురించే ఉన్నాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని వైకాపా అధినేత పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేశారు.