శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 3 మే 2018 (20:56 IST)

ఆడబిడ్డలపై అరాచకం చేసేవారికి బహిరంగ శిక్ష వేయాలి: పవన్ కళ్యాణ్

"కతువా నుంచి కన్యాకుమారి దాకా జరిగే అత్యాచార సంఘటనలు విన్నప్పుడల్లా నాతో సహా పౌర సమాజం కూడా తీవ్రమైన వేదనకి గురవుతుంది. ఈ రోజు దాచేపల్లి సంఘటన కూడా మనసు కలిచి వేసింది. నిస్సహాయతకు గురి చేసింది. ఇలాంటి పరిస్థితిలో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయా

"కతువా నుంచి కన్యాకుమారి దాకా జరిగే అత్యాచార సంఘటనలు విన్నప్పుడల్లా నాతో సహా పౌర సమాజం కూడా తీవ్రమైన వేదనకి గురవుతుంది. ఈ రోజు దాచేపల్లి సంఘటన కూడా మనసు కలిచి వేసింది. నిస్సహాయతకు గురి చేసింది. 
 
ఇలాంటి పరిస్థితిలో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురయిన ఆ బిడ్డకి, వారి కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. అసలు ఆడబిడ్డలపై ఇలాంటి అరాచకం చేసే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలంటే బహిరంగంగా శిక్షించే విధానాలు రావాలని నేను కోరుకుంటున్నాను." అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.