శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (04:00 IST)

గన్నవరంలో మాస్క్‌లేని వారికి జరిమానాలు

ప్రస్తుతం కోవిడ్‌ రెండో విడత విస్తతంగా ఉన్న కారణంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ లేకుండా తిరిగే వారిని ఆదివారం గన్నవరంలో పోలీసులు పట్టుకుని జరిమానా విధించారు.

గన్నవరం దావాజిగూడెం రోడ్డు, నూజివీడు రోడ్లలో, గాంధీబొమ్మ సెంటర్లలో తూర్పు విభాగం ఏసిపి విజరు పాల్‌, గన్నవరం సిఐ కోమాకుల శివాజీ పర్యవేక్షణలో ఎస్‌.ఐలు పురుషోత్తం, రమేష్‌ బాబు, సిబ్బంది బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ లేకుండా సంచరిస్తున్న 100 మందిపై జరిమానా విధించారు.

సిఐ వారికి అవగాహన కల్పిస్తూ మాస్క్‌లు అందజేశారు. కోవిడ్‌ రెండో విడత విస్తతంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా మెలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
 
ద్విచక్ర వాహనంపై ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించడం మంచిది.మాస్క్‌, సానిటైజర్లు వాడాలి. సామాజిక దూరం పాటిం చాలి. హోటళ్లల్లో డిస్పోజబుల్‌ వస్తవులు వినియోగించడం మంచిదన్నారు.

షేక్‌ హాండ్‌ ఇవ్వకండి. త్వరగా పని ముగించుకుని ఇంటికి చేరుకోవాలి. ఇంటి వద్ద శుభ్రత పాటించాలి.వధ్ధులూ, చిన్న పిల్లలు,అనారోగ్యంతో బాధపడుతున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత ఎక్కువ సార్లు చేతులు శుభ్రపరచుకోవడం మంచిది. కోవిడ్‌ వాక్సిన్‌ విధిగా వేయించుకోవాలి.

కోవిడ్‌ రెండో విడత విస్తతంగా ఉన్న కారణంగా తప్పనిసరి పరిస్థితులలో తప్ప ఎవ్వరూ పిఎస్‌కు రాకూడదు. ఒక ఫిర్యాదు తో ఒకరుమాత్రమే తప్పని పరిస్థితులలో ఇద్దరు మాత్రమే అనుమతించబడతారు.

ప్రతీ ఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించాలి మరియూ సానిటైజర్‌ వెంట తెచ్చుకోవాలి. సామాజిక దూరాన్ని విధిగా పాటించాలి. జన సమూహాలతో కార్యక్రమాలు నిర్వహించొద్దు. కోవిడ్‌ నివారణ చర్యలు విధిగా ప్రతిఒక్కరూ పాటించాలి.