జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఆయన వెనుకే జనం వున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నందున ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. రెండవసారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అంటూ జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక యువత సాధికారత, ఉపాధిపై దృష్టి సారిస్తుంది. కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని చెప్పారు.
ఒకవేళ ప్రజలు టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడును ఎన్నుకుంటే, తమకి విరామం వస్తుందని అన్నారు. కొనసాగుతున్న సంక్షేమ పథకాల్లో మేనిఫెస్టో అమలుకు జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నందున వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోకు విశ్వసనీయత ఉందన్నారు. ఆచరణాత్మకంగా అమలు చేయడానికి సాధ్యమయ్యే మ్యానిఫెస్టోను ఆయన ప్రకటించారు. గత మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమైనందున ఆయన మ్యానిఫెస్టోపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు.