బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:18 IST)

సినీ సెలబ్రిటీలనే కాదు... సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా వదలని కరోనా: పేర్నికి కోవిడ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నానికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. దీంతో ఆయన వైద్యు సూచన మేరకు హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో రోజుకు 10 వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు ఈ వైరస్ బారినపడగా, తాజాగా మంత్రి పేర్నికి ఈ వైరస్ సోకింది. 
 
మరోవైపు, మంగళవారం పీఆర్సీపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో సమావేశంకానున్నారు. ప్రభుత్వం పిలుపు మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు సమావేశమయ్యే అవకాశం ఉంది కానీ, మంత్రికి కరోనా వైరస్ సోకడంతో ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు.