శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (07:51 IST)

టపాకాయలతో మొక్కలు

బాణాసంచా అంటేనే వాతావరణ కాలుష్యానికి మారుపేరు. దీపావళి పండుగ వస్తోందంటే చాలు బాణాసంచా సంబరాలు అన్నీ ఇన్నీ కావు.

అయితే పర్యావరణాన్ని సంరక్షించుకోవాలన్న తపన ప్రజలలో పెరుగుతున్న కొద్దీ ఈ దిశలో నూతన ఆవిష్కరణలు కూడా వెలుగు చూస్తున్నాయి. వాతావరణ కాలుష్యానికి పూర్తిగా చెక్‌ పెట్టడమే కాకుండా పర్యావరణ సంరక్షణకు దోహదపడే వినూత్న బాణాసంచాను సీడ్‌ పేపర్‌ ఇండియా అనే స్టార్టప్‌ సంస్థ సిద్ధం చేసింది.

బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిన ఈ సంస్థ దేశంలోనే తొలిసారి పొగలేని, శబ్ధం చేయని అత్యంత సురక్షితమైన టపాకాయాలను రూపొందించింది. ఆశ్చర్యం ఏంటంటే ఈ టపాకాయలు పేల్చిన చోటల్లా మొక్కలు మొలుస్తాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది పచ్చి నిజం.

సీ డ్‌ పేపర్‌ ఇండియా సంస్థాపకుడు రోషన్‌ రే వీ టి విశేషాలను మంగళవారం మీడియాతో పం చుకున్నారు. తొలిదశలో దాదాపు 50కుపైగా ప ర్యావరణ స్నేహి టపాకాయలను సిద్ధం చేశా మన్నారు.