మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 6 మే 2020 (20:36 IST)

వలస కార్మికులను ఆదుకోండి ప్లీజ్: కన్నా

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వలస కార్మికుల కాలినడకన వారి స్వస్థలాలకు చేరుకోవడానికి పడుతున్న అష్ట కష్టాలపై స్పందించి వారికి వెంటనే సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ వ్రాశారు. 
 
కోవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఎక్కడివారు అక్కడ నిలచి పోవడంతో వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకోవలన్న ఆందోళనలో వందల కిలోమీటర్లు చిన్న పిల్లలతో కలసి భుజాలపై సామాను పెట్టుకుని చేతిలో డబ్బులు లేకుండా కాలినడకతో ప్రయాణం చేస్తున్న వారి దయనీయ పరిస్థితి హృదయ విధారకంగా ఉందని,వారిలో కొంత మంది గర్భిణులు కూడా ఉండటం దురదృష్టకరమని వారి పరిస్థితిని తెలియజేశారు. 
 
వలస కార్మికులు పడుతున్న ప్రయాణ కష్టలకు అండగా ఆహార పొట్లాలు,తాగునీరు,మజ్జిగ పాకెట్లు మరియు పాలు మొదలైన కనీస అవసరాలు అందించేలా ఆదేశాలు జారీ చేయాలని అలాగే వారి ప్రయాణానికి తగిన ఏర్పాట్లతో పాటు వేసవి తాపం నుంచి ప్రాణాలు కాపాడుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు.