బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మృతి - సంతాపం తెలిపిన జగన్ - బాబు

heeraben funeral
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకులోనై ఆస్పత్రిలో చేరిన ఆమె శుక్రవారం వేకువజామున 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. మరణవార్త తెలుసుకున్న వెంటనే ప్రధాని మోడీ హుటాహుటిన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన స్వయంగా తల్లి పాడెమోశారు. తల్లిని కోల్పోయి బాధలో ఉన్న ప్రధాని మోడీకి పలువురు ప్రముఖులు తమ సానుభూతిని తెలుపుతున్నారు.
 
ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ కష్ట సమయంలో తమ ప్రార్థనలు మోడీ కుటుంబంతో ఉంటాయని చెప్పారు. హీరాబెన్ మోడీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాని ట్వీట్ చేశారు. 
 
అలాగే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. తల్లిని కోల్పోవడంతో ఎవరికైనా అత్యంత బాధాకరమని చెప్పారు. మాతృమూర్తిని కోల్పోయిన ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. మోడీ కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరారు.