శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: మంగళవారం, 3 మార్చి 2015 (18:47 IST)

కొల్లం గంగి రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్న ఆంధ్రప్రదేశ్

ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగి రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ మధ్యనే మలేషియాలో అరెస్టయిన ఆయన ఒకవైపు బెయిలు కోసం సర్వ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పోలీసులు గంగిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. నిన్నటికి నిన్న ఆయన పాస్ పోర్టును విదేశాంగ శాఖ రద్దు చేసింది. 
 
ప్రస్తుతం ఆయన  ఆస్తులపై కన్నేసింది ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ. ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలను ఎర్రచందనం టాస్క్ ఫోర్సు తెప్పించింది. చిత్తూరు, కడప జిల్లాలో ఉన్న ఆస్తుల వివరాలను సేకరించారు. వాటిని రాష్ట్ర డిజిపి జేవీ రాముడుకు అప్పగించారు. స్థిర ఆస్తులను, ఎకరాలకు ఎకరాలు భూమి వివరాలను అందులో తెలిపారు. 
 
కడప, చిత్తూరు జిల్లాలలో  గంగి రెడ్డి గనులను, పెట్రోల్ బంకులను కలిగి ఉన్నారు. కడప జిల్లా పుల్లం పేటలో పెట్రోల్ బంకు, మంగపేటలో బైరటీస్ గనులు ఉన్నాయి. బినామీల పేర్ల దాదాపు 50 ఎకరాల భూమి ఉన్నట్లు కనుగొన్నారు. తిరుపతిలో గంగి రెడ్డి ఒక ఎకరా హథీరాంజీ భూములను ఆక్రమించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
మఠం భూములలో ఆయన పెద్ద బంగ్లాను నిర్మించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ పాస్ పోర్టు అధికారులు ఆయన పాస్ పోర్టును రద్దు చేశారు. ఇదిలా ఉండగా మారిషస్ లో కోర్టు ఆయన బెయిలు పిటీషన్ ను తిరస్కరించింది. దీంతో గంగిరెడ్డిని పట్టుకోవడం పోలీసులకు సులవవుతుంది.