సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 6 సెప్టెంబరు 2018 (13:10 IST)

విలేకరికి రూ.50 లక్షలు.. బాధితురాలికి రూ.50 లక్షలు.. పోలీసులకు రూ.5 కోట్లు.. ఎందుకు?

న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులే రక్షించాల్సిందిపోయి.. భక్షించేందుకు సిద్ధమయ్యారు. వివిధ కేసులపై స్టేషన్‌కు వచ్చే వారిని తాము సెటిల్‌మెంట్ చేస్తామని కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. ఇలా ఓ పెద్దమనిషి ఓ మ

న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులే రక్షించాల్సిందిపోయి.. భక్షించేందుకు సిద్ధమయ్యారు. వివిధ కేసులపై స్టేషన్‌కు వచ్చే వారిని తాము సెటిల్‌మెంట్ చేస్తామని కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. ఇలా ఓ పెద్దమనిషి ఓ మహిళతో నెరపిన అక్రమ సంబంధం కేసు నుంచి కాపాడుతానని రూ.5కోట్లు వసూలు చేసిన ఘటన జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న 40 ఏళ్ల మహిళకు.. ఒక కన్స్‌స్ట్రక్షన్ కంపెనీ ఎండీతో పరిచయం ఏర్పడి.. అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మిస్తూ ఎండీ తన బంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కానీ సదరు మహిళ అతనితో విబేధాల కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును అదనుగా తీసుకుని పోలీసులు డబ్బున్న పెద్దమనిషిని బెదిరించి కోట్లు కొల్లగొట్టారు. 
 
ఈ కేసును వాపస్ తీసుకోమని బాధితురాలిని పోలీసులు అడిగారు. ఈ క్రమంలో బాధితురాలికి రూ.50 లక్షలు, విలేకరికి రూ.50 లక్షలు ఇచ్చారు. అయితే ఒప్పందం ప్రకారం తనకు ఇంకా రూ.50 లక్షలు రావాలంటూ బాధితురాలు ఎండీని నిలదీసింది. తాను రూ.5 కోట్లు ఇచ్చానని చెప్పాడు. దీనిపై ఆగ్రహించిన మహిళ పోలీసులు తనను మోసగించారని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేసింది. 
 
మరోవైపు తన వాటాగా వచ్చిన రూ.50 లక్షలలో సదరు విలేకరి విలాసవంతమైన భవంతి కొనడంతో పాటు స్నేహితులతో గోవా ట్రిప్‌కు వెళ్లినట్లుగా సమాచారం. విషయం బయటకు పొక్కితే పోలీస్ శాఖ పరువు పోతుందని గ్రహించిన ఉన్నతాధికారులు.. అంతర్గతంగా కేసును విచారిస్తున్నారు.