బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 18 సెప్టెంబరు 2021 (16:38 IST)

అయ్య‌న్న వ్యాఖ్య‌ల‌ను ఖండించిన ఏపీ పోలీస్ అధికారుల‌ సంఘం

మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడి వ్యాఖ్య‌ల‌ను ఏపీ పోలీస్ అధికారుల‌ సంఘం త‌ప్పుబట్టింది. సంఘం కార్య‌ద‌ర్శి జ‌నుకుల శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడుతూ, కోడెల శివప్రసాద్ సంతాప సభలో అయ్యన్న పాత్రుడు పోలీస్ అధికారులపై మాట్లాడిన మాటలు ఖండిస్తున్నామ‌న్నారు.

గతంలో గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న మీరు పోలీస్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడారు. అందుకే,  భవిష్యత్తులో మీకు అలాంటి పదవులు ఇవ్వకూడదని కోరుతున్నాం. నా కొడకల్లారా... అని మాట్లాడుతున్నారు, మేము మా భాషలో మాట్లాడితే మీరు తట్టుకోలేరు. అలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు.
 
పోలీస్ వ్యవస్థ ఎంత కఠినతరమైనదో మీకు తెలుసు. అన్యాయం జరిగితే న్యాయస్థానాల‌ను ఆశ్రయించండి. రాజ్యాంగ హక్కులు మాకు లేవా, మీకేనా హక్కులు ఉన్నది అని హెచ్చ‌రించారు.
 
సంఘం ఉపాధ్యక్షురాలు నాగిని మాట్లాడుతూ, ఒక సామాన్య ప్రజలను తిట్టినట్టు ఐ.పి.ఎస్. అధికారులను తిట్టడం సరికాద‌న్నారు. ఉన్నత చదువులు చదువుకున్న వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, కింది స్థాయి వాళ్ళని ఇంకెలా మాట్లాడతారో అని ఆన్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు పై ఉంద‌ని, అయ్యన్న పాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాల‌ని డిమాండు చేశారు. 
 
మ‌రో స‌భ్యుడు సోమయ్య మాట్లాడుతూ, చంద్రబాబు ఏ రోజు పోలీస్ లను ఒక మాట కూడా అనలేదు. ఇవాళ అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి. చట్ట సభల్లో కూర్చుని మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయ‌డం తగదు. మీ మాటలను వెనక్కి తీసుకోవాల‌ని డిమాండు చేశారు.