ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (11:51 IST)

లిస్బన్ పబ్‌లో అశ్లీల డ్యాన్సుల జోరు...

హైదరాబాద్ నగరంలో ఉన్న పబ్బుల్లో లిస్బన్ పబ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ మధ్యకాలంలో ఈ పబ్‌లో అసాంఘిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా పబ్‌లో అశ్లీల నృత్యాలతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు బేగంపేటలోని లిస్బన్‌ రెస్టో బార్‌ అండ్‌ పబ్‌(లిస్బన్‌పబ్‌) కంట్రీక్లబ్‌పై దాడులు నిర్వహించారు. 
 
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారితో పాటు సహకరించిన వారు... పబ్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, పంజాగుట్ట పోలీసులు శనివారం సాయంత్రం సంయుక్తంగా దాడులు నిర్వహించి మొత్తం 28మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.